జంధ్యాలకు వేటూరి "అక్షర సంధ్యావందనం"

జంధ్యా వందనం

హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసం, నిన్నటి దరహాసం జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు.ఎంత కాదనుకున్నా కన్నీళ్ళూ కళ్ళతోనే మింగటం కన్నా శరణం లేదు.

తెలుగు సినిమా అపహాస్యం పాలెక్కువై పరిహాస్యం పాలై పోతున్న ఈనాడు జంధ్యాల తన వంశవృక్షంతో సహా దర్శనమిచ్చి ఆదుకుంటాడు. పానుగంటి, కందుకూరి, గురజాడ, చిలకమర్తి, భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యం మొదలయిన శాఖోపశాఖలతో విరాజిల్లే ఆ హాస్య కల్పవృక్షానికి మూల స్థానం లో కూర్చుని "ఫిబరే హ్యూమరసం" అని రస పిపాసులకు తన కలం నించి వెలువడిన హాస్య రస కలశాలను అందించిన తెలుగుజాతి చిరునవ్వు జంధ్యాల.

Read more...

"నవ్వు" రసాల బ్రహ్మ

మధురస్మృతులు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Read more...

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావుకి నివాళి

 

చంటబ్బాయ్ సినిమాలో ఇంగ్లీషు మాట్లాడే బట్లరు పాత్రలో "ఏరా సెవెన్ హిల్సు, ఇది ఆరోసారి రాంగ్ నంబర్ స్పీక్ చేయడం. ఏమి ఆటలుగా ఉందా..ఆహా గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను. నాతో పెట్టుకోకురా రేయ్. కుంతీ సెకండ్ సన్ బూన్, అదే భీమవరంలో వన్ ఏడాది క్రితం ఒకడిని చావ హిట్టాను. కీపెయ్యి. రెస్పెక్ట్ గా ఫోన్ కీపెయ్యి." "గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్..అదేనమ్మా తోటకూర"  అంటూ నవ్వులు కురిపిస్తారు.

Read more...

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు (మూడవ భాగం)

సుత్తి వీరభద్రరావు పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చే సినిమా "వివాహ భోజనంబు". రకరకాల ఆసనాలు వేస్తూ తన ఇంట్లో అద్దెకుంటున్న కవి అయిన బ్రహ్మానందానికి "సినిమా స్టోరీ" చెప్పే పాత్రను ఆయన పోషించారు. సినిమా రచయిత కావాలనుకొనే బ్రహ్మానందం ఓ కథ చెబితే దాన్ని తీసిపారేసి ఊళ్ళు, సందులు, ఆహారపదార్థాల జాబితా చెప్పి ఇలా సినిమా తీయాలంటాడు. తెవికీనుండి సంగ్రహించిన ఆ సరదా సంభాషణలు:

మట్టి పూసుకొని ఉన్నపుడు బ్రహ్మానందం సంభాషణ--(ఏడుపు గొంతుతో) ఈ చెమ్మంతా ఇగిరేలోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాఏమో మహాప్రభో. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే . "జూ" వాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళి పోతారు. జనమెవరయినా చూస్తే ఇతర గ్రహాలనుండి వచ్చారనుకొని రాళ్ళుచ్చుక్కొడతారు... (ఆశగా) ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభో.

Read more...